header

Arctic Ocean ...ఆర్కిటిక్ సముద్రం....

ఆర్కిటిక్ సముద్రం భూగోళానికి ఉత్తరదిశలో ఉన్నది. ఉత్తర ధ్రువానికి చుట్టూ ఉన్నది. మొత్తం అయిదు సముద్రాలలో కెల్లా ఈ సముద్రం చిన్నది మరియు లోతు లేనిది. మంచు కరగటం వలన ఈ సముద్రంలోనికి ఎక్కువగా మంచినీరు వచ్చి కలుస్తుంది. ఈ సముద్రం సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. పోలార్ బీర్స్ అనే సముద్ర జంతువులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి.తిమింగలాలు, Walrus అనబడే నీటిగుర్రాలు కూడా ఈ సముద్రంలో ఉన్నాయి. ఈ సముద్ర తీరప్రాంతంలో పెట్రోలియం మరియు సహజవాయువుల నిక్షేపాలు కలవు.
ఈ సముద్రం మొత్తం 14,056,000 చ.కి.మీ భూభాగాన్ని ఆక్రమించి ఉంది. 18, 456 అడుగుల లోతు కలిగి ఉన్నది.
అమెరికా, కెనడా, గ్రీన్ ల్యాండ్స్, ఐస్ ల్యాండ్, నార్వే, రష్యా దేశాలు ఈ సముద్రపు ఒడ్డున ఉన్నాయి.