header

Groundnut Chekkalu / పల్లీలతో చెక్కలు

Groundnut Chekkalu / పల్లీలతో చెక్కలు

కావలసినవి
బియ్యప్పిండి: పావుకిలో
పల్లీలు: కప్పు
తెల్లనువ్వులు: 3 టేబుల్స్పూన్లు
జీలకర్ర: టీస్పూను
పచ్చిమిర్చి ముద్ద: అరటీస్పూను
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
నూనె లేకుండా పల్లీలను వేయించి, పొట్టు తీసి పొడి చేసుకోవాలి. కాసిని పల్లీలను కచ్చాపచ్చాగా చేసి విడిగా ఉంచాలి.
వెడల్పాటి గిన్నెలో బియ్యప్పిండి, పల్లీలపొడి, కచ్చాపచ్చాగా నూరిన పల్లీలు, తెల్ల నువ్వులు, పచ్చిమిర్చి ముద్ద, జీలకర్ర, తగినంత ఉప్పు, రెండు టీస్పూన్ల వేడి నూనె వేసి కలపాలి. తరవాత సరిపడా నీళ్లు పోసి ముద్దలా కలపాలి.
ఇప్పుడు పిండిని చిన్న ముద్దల్లా చేసి పాలిథీన్ కవర్మీద చెక్కల్లా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.